శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః

అనాది నిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః          5    AUDIO

37

స్వయంభూ

తనంతట తానుగానే ఉత్పన్న మయినవాడు

38

శంభుః

శుభములను ప్రసాదించువాడు

39

ఆదిత్యః

సూర్యభగవానుడు.

40

పుష్కరాక్షః

తామరపూవులవంటి నేత్రములు కలవాడు.

41

మహాస్వనః

గంభీరమగు దివ్య నామ స్వరూపుడు.

42

అనాదినిధనః

ఆది(జననము), నిధనము (మరణము, నాశనము) లేనివాడు

43

ధాతా

నామరూపాత్మకమైన ఈ చరాచర విశ్వమంతటిని ధరించినవాడు

44

విధాతా

చక్కని విధానములను గావించినవాడు సూర్యుడు ప్రకాశించుట, గాలి వీచుట, మేఘం వర్షించటం  - అగ్ని మండటం, మొదలైనవి.

45

ధాతురుత్తమః

ప్రపంచోత్పత్తికి కారణ భూతములగు సమస్త భూతములకూ ఆధారభూతుడు.

FirstPreviousNextLastIndex

Slide 6 of 110