Make your own free website on Tripod.com

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమ క్రమః

అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్. 9 AUDIO

 

74

ఈశ్వరః

సర్వమును శాసించువాడు సర్వశక్తి సంపన్నుడు.

75

విక్రమీ

బలము, తేజస్సు, పరాక్రమము మొదలగు వీరుల గుణములు కలవాడు.

76

ధన్వీ

ధనుస్సును ధరించినవాడు.

77

మేధావీ

మహాజ్ఞాన భాండారము.

78

విక్రమః

వామనావతార వైభవమును తెలుపు పవిత్రనామము.

79

క్రమః

విశ్వమంతా నిండి విస్తరించి, వికసించి, వ్యాప్తిచెందిన పరబ్రహ్మము

80

అనుత్తమః

ఈయనకంటే మరియొక శ్రేష్టుడైన వాడు వేరొకడు లేడు.

81

దురాధర్షః

తన్నెదిరింపగల శక్తి సంపన్నుడెవడును లేనే లేడు.

82

కృతజ్ఞః

భగవానుడు ప్రతివాని మనస్సునందును గలుగుచుండు సమస్త ఆలోచనలు గ్రహింపగలిగినవాడై వారి భక్తిశ్రద్ధల కనుగుణముగా ఫలములను ప్రసాదించువాడు.

83

కృతిః

అనగా పురుష ప్రయత్నము. ఇది కూడా దైవస్వరూపమని భావము.

84

ఆత్మవాన్

చరాచరాత్మకమగు విశ్వమందంతటను ఆత్మ స్వరూపుడై భాసిల్లు పూర్ణస్వరూపుడే భగవానుడు.

FirstPreviousNextLastIndex

Slide 10 of 110