Make your own free website on Tripod.com

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః

అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః   10    AUDIO

 

85

సురేశః

దేవతలకు రాజు,  భక్తులకు దేవతలకు కూడ వరప్రదాత.

86

శరణం

తన్ను హృదయపూర్వకంగా శరణు పొందినవారిని రక్షించువాడు.

87

శర్మ

పరమానంద స్వరూపుడు.

88

విశ్వరేతాః

సంసారమను మహావృక్షమునకు భగవానుడే బీజము.

89

ప్రజాభవః

సకల ప్రాణకోటికి జన్మకారణము.

90

అహః

సూర్యకాంతివలె ప్రకాశించువాడు.  కాలస్వరూపుడు. తన్నాశ్రయించిన భక్తులను కాపాడువాడు.

91

సంవత్సరః

నాశనములేని కాలస్వరూపుడు.

92

వ్యాళః

దుర్మార్గులకు సర్పమువలె మహా భయంకరుడు.

93

ప్రత్యయః

జ్ఞానస్వరూపుడు.

94

సర్వదర్శనః

సమస్తమును చక్కగా చూచువాడు.

FirstPreviousNextLastIndex

Slide 11 of 110