శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

వసుర్వసుమనాః సత్యః సమాత్మాసమ్మిత స్సమః

అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః      12    AUDIO

 

104

వసుః

సమస్త భూతములును తనయందే వసించుచున్నవి.

105

వసుమనాః

శ్రేష్ఠమైన మనసు కలవాడు.

106

సత్యః

సత్యమనగా మూడుకాలములందు వుండునది. నాశన రహితమయినది.

107

సమాత్మా

సకల భూతములందును పరమాత్మను దర్శించుటయే జ్ఞానము.

108

సమ్మితః

సకల పదార్థముల చేతను పరిచ్ఛేదము పొందిన వాడు.

109

సమః

వికార రహితుడై అన్నిటి యందును సముడై యున్నవాడు.

110

అమోఘః

భగవాదశ్రయములో వ్యర్థమయినది లేదు.

111

పుండరీకాక్షః

తామరపువ్వు వంటి నేత్రములు కలవాడు.

112

వృషకర్మా

ధర్మమే తన నిజ కర్మముగా కలవాడు.

113

వృషాకృతిః

ధర్మమే ఆకారముగా కలవాడు. మూర్తీభవించిన ధర్మస్వరూపుడు.

FirstPreviousNextLastIndex

Slide 13 of 110