శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః

చతురాత్మా చతుర్వూహః చతుర్దంష్ట్రః చతుర్భుజః        15   AUDIO

 

133

లోకాధ్యక్షః

భగవానుడు సర్వలోకములకు మహేశ్వరుడు.

134

సురాధ్యక్షః

ఆయన దేవతలకు,  దిక్పాలకులకు అధ్యక్షుడై రాక్షసుల బాధలనుండి కాపాడును.

135

ధర్మాధ్యక్షః

జీవులాచరించిన ధర్మాధర్మములను పరిశీలించి ఫలముల నొసంగువాడు.

136

కృతాకృతః

కృతము=సృష్టింపబడినది (కార్యరూపము),  అకృతము=సృష్టింపబడనది (కారణరూపము)

137

చతురాత్మ

సృష్టి చేయుట యందు వేరువేరైన నాలుగు విభూతులతో నొప్పువాడు.  1. బ్రహ్మ 2. దక్షుడు / ప్రజాపతులు 3. కాలము 4. ప్రాణులు,  ఈ నాలుగు జగత్తు స్థితికి కారణమైన నాలుగు భగవంతుని విభూతులు.

138

చతుర్వ్యూహః

1. పరమాత్మ 2. జీవుడు 3. మనస్సు 4. అహంకారము, ఈ నాలుగు వ్యూహముల నాధారముగా సృష్టి కార్యము చేయ బడెను.

139

చతుర్దంష్ట్ర

నాలుగు కోరలతో అవతరించిన నరసింహావతారము.  1. జాగ్రత్ 2. స్వప్న 3. సుషుప్తి 4 తురీయావస్థలు.

140

చతుర్భుజః

నాలుగు బాహువులతో విలసిల్లువాడు.  1. శంఖము 2. చక్రము 3. గద 4. పద్మము.

FirstPreviousNextLastIndex

Slide 16 of 110