శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

ఉపేంద్రోవామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః

అతీంద్రః సంగ్రహః సర్గోధృతాత్మా నియమోయమః  17   AUDIO

 

151

ఉపేంద్రః

ఇంద్రునికంటే అధికుడు.

152

వామనః

శ్రీమహా విష్ణువు యొక్క వామనావతారము

153

ప్రాంశుః

మిక్కిలి విస్తారమగు దేహము కలవాడు.

154

అమోఘః

వ్యర్థములుగాని ప్రయత్నములు చేయువాడు.

155

శుచిః

పరమ పవిత్రుడు.

156

ఊర్జితః

అనంతమగు శక్తి సామర్థ్యములతో విలసిల్లువాడు.

157

అతీంద్రః

తనయొక్క శక్తులతో  ఇంద్రుని మించిన వాడు.

158

సంగ్రహః

ప్రళయకాలమున సర్వమును ఒకచోట చేర్చువాడు.

159

సర్గః

సృష్టి యంతయును తన రూపమే ఐనవాడు.

160

ధృతాత్మా

జననమరణాది వికారములు లేకుండా ఒకేరూపముగా వుండువాడు.

161

నియమః

సమస్తమును నియమించి, శాసించి, పాలించువాడు.

162

యమః

సమస్తములగు ప్రకృతి శక్తులను తన వశమునందే యుంచుకొన్నవాడు.

FirstPreviousNextLastIndex

Slide 18 of 110