Make your own free website on Tripod.com

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

మహాబుద్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః

అనిర్దేశ్యవపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్    19   AUDIO

 

173

మహాబుద్ధిః

అనంతమగు బుద్ధిబలంతో శోభిల్లువాడు.

174

మహావీర్యః

అనంత వీర్య సంపన్నుడు.

175

మహా శక్తిః

క్రియాశక్తి, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి మున్నగు సర్వశక్తి మహాసాగరుడు.

176

మహాద్యుతిః

మహాద్భుతమగు దివ్యకాంతి సంపన్నుడు.

177

అనిర్దేశ్యవపుః

వర్ణించుటకు వీలుకాని, ఊహింపనలవికాని  ఆకారము గలవాడు.

178

శ్రీమాన్

నిరంతరము లక్ష్మి(ఐశ్వర్యశక్తిసంపదల)తో వుండువాడు.

179

అమేయాత్మా

సర్వవ్యాపక, సర్వశక్తి సంపన్నమగు ఆత్మ స్వరూపుడు.

180

మహాద్రిధృత్

గొప్ప కొండలను ధరించువాడు.

FirstPreviousNextLastIndex

Slide 20 of 110