శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః

అనిరుద్ధః సురానందో గోవిందో గోవిందాంపతిః    20   AUDIO

 

181

మహేష్వాసః

గొప్ప విలుకాడు. కోదండము ధరించి దుష్ట సంహారము గావించిన శ్రీరాముడు.  మనస్సును ఆవరించిన సమస్తపాతకములను మనోనిగ్రహముతో కూడిన ప్రణవోపాసనము చేత నశించును.

182

మహీభర్తాః

ప్రళయసాగరములో నున్న భూమిని ఉద్ధరించినవాడు.

183

శ్రీనివాసః

శ్రీదేవికి నిత్యనివాసుడైన వాడు.  శ్రీ(సంపద)నివాసుని ఆశ్రయించినవారికి సకల సంపదలు కలుగును.

184

సతాంగతిః

సత్పురుషులకు గతియైన వాడు.

185

అనిరుద్ధః

ఆయనను నిరోధింప గలవారెవ్వరూ లేరు.

186

సురానందః

దేవతలకు ఆనందము గూర్చువాడు.

187

గోవిందః

భూమియందలి దుర్జనులను సంహరించి ఆనందము కలుగజేయువాడు.  గోపాలుడు. మూగవానిచేత మాట పలికించి ఆనందింపజేయువాడు.

188

గోవిదాం పతిః

గోవిదులనగా వేదవిదులు. వేదవిదులకు పతియైనవాడు.

FirstPreviousNextLastIndex

Slide 21 of 110