శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

అమృత్యుః సర్వదృక్ సింహః సన్దాతా సన్దిమాన్ స్థిరః

అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా.    22   AUDIO

 

198

అమృత్యుః

మరణముగాని నాశనముగాని లేనివాడు.

199

సర్వదృక్

సకల భూతములందును సర్యకాలముల యందును కలుగుచున్న సకల కార్యకలాపములను చక్కగా దర్శించువాడు పరమాత్మ.

200

సింహః

హింసించువాడు.  దుర్మార్గులను అవినీతిపరులను నాశనము చేయువాడు.

201

సన్దాతాః

సమన్వయపరచువాడు.  మానవులాచరించు కర్మలను పరీక్షించి వాటికి తగిన ఫలములను సరిగా ప్రసాదించువాడు.

202

సన్దిమాన్

కర్మఫల ప్రదాతయేకాక జీవరూపుడై కర్మఫలముల ననుభవించు వాడును పరమాత్మయే.

203

స్థిరః

నిశ్చలుడు, నిరాకారుడు, నిత్యుడు, సర్వకాలములందు ఏకరీతిగా నుండువాడు.

204

అజః

పుట్టుకలేనివాడు.

205

దుర్మర్షణః

జయించుటకుగాని ఎదుర్కొనుటకుగాని శక్యముగాని వాడు.

206

శాస్తా

శాసనకర్త

207

విశ్రుతాత్మా

విస్తరించిన సమస్త సద్గుణములతో భాసిల్లుచున్నవాడు.

208

సురారిహా

దేవతలకు శత్రువులైన రాక్షసులను సంహరించువాడు.

FirstPreviousNextLastIndex

Slide 23 of 110