Make your own free website on Tripod.com

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్ధనః

అహస్సం వర్తకో వహ్నిరవిలోధరణీ ధరః      25    AUDIO

 

228

ఆవర్తనః

జననమరణ క్లేశరూపమగు సంసారచక్రమును త్రిప్పువాడు.

229

నివృత్తాత్మాః

నిరంతరము జీవులను సంసారచక్రములో త్రిప్పువాడైనా,  తాను మాత్రము సంసారబంధనములకతీతుడై వుండువాడు.

230

సంవృత;

కప్పబడియుండువాడు.  (యోగమాయచేత కప్పబడియున్నవాడు కనుక తెలియబడనివాడు)

231

సంప్రమర్దనః

దుర్మార్గులను పాపాత్ములను వారివారి కర్మానుసారం మర్దించి (శిక్షించి) ధర్మమార్గములో నడుపువాడు.

232

అహస్సంవర్తకః

సూర్యునిరూపమున నుండి దినములను చక్కగా ప్రవర్తింపచేయువాడు.

233

వహ్నిః

అగ్ని హోత్రుడు.  

234

అనిలః

వాయుదేవుడు.  తనకొక ప్రత్యేక నివాస స్థలమనునది లేక యుండువాడు.

235

ధరణీధరః

ఆదిశేషుని రూపమున ఆది వరాహ రూపమున భూమిని ధరించువాడు.

FirstPreviousNextLastIndex

Slide 26 of 110