శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః

అపాంనిధి రధిష్టాన మప్రమత్తః ప్రతిష్టితః    35     AUDIO

 

318

అచ్యుతః

తన్ను శరణాగతిని బొందిన భక్తులకెన్నడూ పతనము లేదు.

319

ప్రధితః

తాను ప్రసిద్ధుడై అంతటను నిండి విస్తరిల్లి వ్యాపించిన వాడు.

320

ప్రాణః

సకలభూతముల యందు చైతన్యస్వరూపమగు ప్రాణశక్తి తానే ఐనవాడు.

321

ప్రాణదః

ప్రాణములు ఇచ్చువాడు. ప్రాణములు తీయువాడు.

322

వాసవానుజః

ఇంద్రునికి సోదరుడు.

323

అపాంనిధిః

జలములకు నిలయమగు సముద్రము.  సాగరము భగవంతుని విభూతి.

324

ఆధిష్టానమ్

చిత్రవిచిత్ర నామరూపాలతో గోచరిస్తూ సంసారప్రపంచమునకు ఉపాదాన కారణమైన వాడు.

`325

అప్రమత్తః

సోమరితనము, మాంద్యము, అలసత్వము లేనివాడు.

326

ప్రతిష్టితః

కార్యకారణరూపమైన విశ్వమునకు అతీతుడు.

FirstPreviousNextLastIndex

Slide 36 of 110