శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః

ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః     45    AUDIO

 

416

ఋతుః

భగవానుడు ఋతువుల స్వరూపుడై తానే ప్రవర్తిల్లుచున్నాడు.

417

సుదర్శనః

తన భక్తులకు సులభముగా దర్శన మిచ్చువాడు.

418

కాలః

కాలాతీతుడు.  కాల స్వరూపుడు.

419

పరమేష్ఠీ

శ్రేష్టమగు స్వకీయమగు మహిమచేత హృదయాకాశమునందుండు వాడు.

420

పరిగ్రహః

భక్తులు ప్రీతితో సమర్పించిన ఎంత చిన్న వస్తువునైనా గ్రహించువాడు.

421

ఉగ్రః

దుష్టులకైనా,  దుర్మార్గులకును భగవానుడు భయంకరుడై వారిని దండించువాడు.

422

సంవత్సరః

కాలమే భగవత్స్వరూపము. సకల భూతములకును ఆయనయే నిలయమైనవాడు.

423

దక్షః

విశ్వము యొక్క సృష్టి -స్థితి -లయములను  మరియు సర్వకార్యములను మిక్కిలి దక్షతతో  నిర్వహించువాడు.

424

విశ్రామః

భక్తులకు చక్కని విశ్రాంతి స్థానమయినవాడు.

425

విశ్వదక్షిణః

సర్వసమర్థుడు సర్వశక్తి భాండారము.  సకల కర్మలు తానొక్కడే దీక్షతో నిర్వహించువాడు.

FirstPreviousNextLastIndex

Slide 46 of 110