శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

యజ్ఞ ఇజ్యో మహేజ్ఞశ్చ క్రతుః సత్రంసతాంగతిః

సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్                 48  AUDIO

 

445

యజ్ఞః

భగవానుడు యజ్ఞస్వరూపుడు. మానవుడు నిత్యమును పంచ (దేవ,ఋషి,పితృ,అతిథి,భూత) మహా యజ్ఞములు చేయవలెను.

446

ఇజ్యః

పూజింపదగినవాడు. భగవానుడు సర్వదేవతా స్వరూపుడు. సర్వశ్రేష్టుడు.

447

మహేజ్యః

అత్యధికముగా పూజింపదగినవాడు. అన్నిఫలములకంటే శ్రేష్టమగు మహాఫలమును ప్రసాదించువాడు.

448

క్రతుః

సర్వయజ్ఞములు దైవస్వరూపములే.

449

సత్రం

సత్పురుషులను రక్షించువాడు.

450

సతాంగతిః

సత్పురుషులకు గతియైనవాడు.

451

సర్వదర్శీ

సర్వమును దర్శించువాడు.

452

విముక్తాత్మా

బంధనములు లేనివాడు పరమాత్మ.  సకల కార్యములు ఆయా అవతారములలో చేసినను ఆయన నిస్సంగుడు, నిర్లిప్తుడు.  కనుక విముక్తాత్మ అనబడును.

453

సర్వజ్ఞః

సర్వమును తెలిసినవాడు.

454

జ్ఞానముత్తమమ్

అన్ని జ్ఞానములకంటే పరమాత్మ జ్ఞానమే సర్వశ్రేష్టము.

FirstPreviousNextLastIndex

Slide 49 of 110