శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

సువ్రతః సులభః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్

మనోహరో జితక్రోధో వీర బాహుర్విదారణ              49  AUDIO

 

455

సువ్రతః

చక్కని నియమములు, వాగ్దానములు, ప్రతిజ్ఞలు గావించిన పరమాత్మ

456

సుముఖః

సుందరమగు ముఖము గలవాడు.

457

సూక్ష్మః

పరమాత్మ సుక్ష్మాతి సూక్ష్ముడు. సర్వాంతర్యామి.

458

సుఘోషః

సుందరమగు మధురనాదము గలవాడు.

459

సుఖదః

తన భక్తులకు సుఖములను ఇచ్చువాడు.

460

సుహృత్

ప్రత్యుపకారమును కాంక్షించక పరులకుపకారమును చేయువాడు.  కరుణాసాగరుడు.

461

మనోహరః

మనస్సును దొంగలించువాడు. మనస్సు నశించునప్పుడే మానవుడు మాధవుడగును.

462

జితక్రోధః

కోపమును జయించినవాడు.

463

వీరబాహుః

శక్తివంతములగు బాహువులు గలవాడు.

464

విదారణః

చీల్చి చంపివేయువాడు. నరసింహావతారుడు.

FirstPreviousNextLastIndex

Slide 50 of 110