Make your own free website on Tripod.com

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశః శాశ్వత స్థిరః

భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః            67     AUDIO

 

624

ఉదీర్ణః

సర్వభూతములకంటే పరమాధిక్యము గలవాడు. మహాశక్తి సంపన్నుడు.

625

సర్వతశ్చక్షుః

అంతటను నేత్రములు కలవాడు.

626

అనీశః

పరమాత్మయే అందరకును అధిపతి.

627

శాశ్వతస్థిరః

శాశ్వతుడు. స్థిరుడు. చలనరహితుడు. సర్వాధారుడు.

628

భూశయః

భూమిపై శయనించువాడు.

629

భూషణః

భూమికి అలంకారమైన వాడు.

630

భూతిః

సకలైశ్వర్య విభూతులకు నిలయమైనవాడు.

631

విశోకః

శోకములేనివాడు.

632

శోకనాశనః

భక్తుల యొక్క సమస్త శోకములను బోగొట్టువాడు.

FirstPreviousNextLastIndex

Slide 68 of 110