శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

కాలనేమినిహావీరః శౌరిః శూరజనేశ్వరః

త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః         69     AUDIO

 

642

కాలనేమినిహా

కాలనేమి యను రాక్షసుని సంహరించినవాడు. కాలాతీతుడు.

643

వీరః

మహావీరుడు.  మహా వీర్యసంపన్నుడు.

644

శౌరిః

శూరుడను వాని వంశమున జన్మించినవాడు.

645

శూరజనేశ్వరః

మిక్కిలి శూరులగువారందరికంటే ప్రసిద్ధుడు.

646

త్రిలోకాత్మా

మూడు లోకములకును ఆత్మయై యున్నవాడు.

647

త్రిలోకేశః

మూడు లోకములకును అధిపతి.

648

కేశవః

సుందరమగు కేశములతో భాసిల్లువాడు.

649

కేశిహా

కేశి యను దుష్టరాక్షసుని సంహరించినవాడు.

650

హరిః

సంసార భయమును హరించువాడు  హరి.

FirstPreviousNextLastIndex

Slide 70 of 110