శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః

అనిర్దేశ్యవపు ర్విష్ణుః ర్వీరోఌనంతో ధనంజయః         70     AUDIO

 

651

కామదేవః

అందరిచేతను ప్రేమింపబడు దేవుడు.

652

కామపాలః

కామములను (కోరికలను) తీర్చువాడు.

653

కామీ

పూర్ణకాముడు. సమస్తకామములును సిద్ధించినవాడు. వాంఛాతీతుడు.

654

కాన్తః

మిక్కిలి సుందరమగు రూపముగలవాడు.

655

కృతాగమః

వేదశాస్ర్తాదుల నిర్మాతయు ప్రబోధనుడును పరమాత్మయే.  స్వాధ్యాయ యజ్ఞము వలన భగవత్ప్రాప్తి కలుగును.

656

అనిర్దేశ్యవపుః

వర్ణించుటకు వీలుకాని శరీరము కలవాడు.

657

విష్ణుః

సర్వ వ్యాపకుడు. సర్వాంతర్యామి.

658

వీరః

వీరత్వము కలవాడు.

659

అనన్తః

దేశము చేతను కాలము చేతను వస్తువు చేతను పరిచ్చేదము బొందనివాడు.

660

ధనంజయః

రాజసూయ యజ్ఞములో దిగ్విజయము సాధించిన అర్జునుడు.

FirstPreviousNextLastIndex

Slide 71 of 110