Make your own free website on Tripod.com

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

బ్రహ్మణో బ్రహ్మకృద్బహ్మో బ్రహ్మ బ్రహ్మ వివర్థనః

బ్రహ్మవిద్బాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః         71     AUDIO

 

661

బ్రహ్మణ్యః

తపస్సు, వేదములు, విప్రులు, జ్ఞానము..  వీనికి హితము చేయువాడు పరమాత్మ.

662

బ్రహ్మకృత్

బ్రహ్మమునకు కర్త.  తపస్సు నందు వుండువాడు. వేదములయందు వెలయువాడు.

663

బ్రహ్మా

సృష్టిచేయునట్టి చతుర్ముఖ బ్రహ్మ.

664

బ్రహ్మ

అన్నిటికంటే స్థూలస్వరూపుడు, అంతటా విస్తరించినవాడు, సత్యజ్ఞానాది లక్షణములతో కూడినవాడు.

665

బ్రహ్మవివర్దనః

బ్రహ్మమును వృద్ధిపొందించువాడు.

666

బ్రహ్మవిత్

బ్రహ్మమును చక్కగా నెరింగినవాడు.

667

బ్రాహ్మణః

బ్రహ్మజ్ఞాన సంపన్నుడే బ్రాహ్మణుడు.

668

బ్రహ్మీ

బ్రహ్మముతో కూడినవాడు.

669

బ్రహ్మజ్ఞః

బ్రహ్మ తత్వము నెరింగినవాడు.

670

బ్రాహ్మణప్రియః

బ్రాహ్మణుల యెడల ప్రియముగా నుండువాడు.

FirstPreviousNextLastIndex

Slide 72 of 110