శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

స్తవ్యః స్తవ ప్రియః స్తోత్రం స్తుతిః స్తోతారణ ప్రియః

పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః        73     AUDIO

 

679

స్తవ్యః

స్తవము చేయదగినవాడు.

680

స్తవప్రియః

భక్తులు ప్రేమతో ఎచ్చట గానము చేయుచుందురో అచ్చటనే భగవంతుడు ఉండును.

681

స్తోత్రమ్

స్తుతిగీతములన్నియును భగవత్స్వరూపములే.

682

స్తుతిః

స్తోత్రము చేయుట. ప్రార్థన చేయుట. వేదగానము, గీతాగానము దైవస్వరూపములే.

683

స్తోతా

స్తోత్రము చేయువాడు. భగవంతుని నామకీర్తనము చేయువారు భగవంతునితో సమానులు.

684

రణప్రియః

యుద్ధము చేయుటయే ప్రియమయినవాడు.

685

పూర్ణః

పరిపూర్ణుడు.

686

పూరయితా

భగవంతుడు తాను పూర్ణుడగుట మాత్రమేకాక తన్నాశ్రయించిన వారందరిని పరిపూర్ణులను చేయువాడు.

687

పుణ్యః

పవిత్రుడు. సుఖస్వరూపుడు.

688

పుణ్యకీర్తిః

భగవానుని దివ్యస్మరణ వలన సకల పాపములు నశించి సత్కీర్తి కలుగును.

689

అనామయః

రోగ రహితుడు.  శారీరక మానసిక వ్యాధులకు అతీతుడు.

FirstPreviousNextLastIndex

Slide 74 of 110