శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

ఏకోనైకః సవః కఃకిం యత్తత్పదమనుత్తమమ్

లోకబంధు ర్లోకనాథో మాధవో భక్తవత్సలః              78   AUDIO

 

725

ఏకః

The Only One.  పరబ్రహ్మము ఒక్కటియే గాని రెండు మాత్రము కాదు.

726

నైకః

Not one but Many.  ఒక్కడే యైనను తన మాయచేత అనేక రూపములు గలవానివలే గనిపించువాడు.

727

సవః

Sacrifice.  వేదోక్తమగు యజ్ఞము.

728

కః

Happiness.  పరమాత్మ ఆనంద స్వరూపుడు.

729

కిమ్

What.   మనస్సును  పరిశుద్ధము చేసికొని అంతర్ముఖుడై  ఏమిటి? అను తత్వచింతన వలననే పరబ్రహ్మము సాధకునకు అనుభవసిద్ధమగును.

730

యత్

Which.  దేని (ఏది?) నుండి సకలభూతములు పుట్టుచున్నవో అదియే బ్రహ్మము.

731

తత్

That.  అది.  ఉన్నదంతా పరబ్రహ్మమే.

732

పదమనుత్తమమ్

The unequalled state of perfection.  సర్వశ్రేష్టమైన దివ్యపదము.  దీనికంటే ఉన్నతమయిన పదము మరియొకటి లేనే లేదు.

733

లోకబంధుః

Friend of World.  ఈ లోకమునకు తండ్రి, తల్లి, తాత, బంధువు పరబ్రహ్మమే.

734

లోకనాధః

Lord of the World.  సర్వలోకములకు అధిపతి శ్రీహరియే.

735

మాధవః

Lord of Lakshmi.  లక్ష్మీపతి.  ప్రకృతికి అధిపతి.

736

భక్తవత్సలః

Lover of Devotees.  తన్నాశ్రయించిన భక్తుల పట్ల ప్రేమాదరణ, వాత్సల్యములు చూపువాడు.

FirstPreviousNextLastIndex

Slide 79 of 110