శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

సువర్ణ వర్ణో హేమాంగో వరాం గశ్చందనాంగదీ

వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీరచలశ్చలః              79   AUDIO

 

737

సువర్ణ వర్ణ

Golden coloured.  బంగారు వంటి దివ్య వర్ణములతో ప్రకాశించువాడు.

738

హేమాంగః

Golden limbed.  బంగారు వర్ణముగల శరీరావయవములతో విలసిల్లువాడు.

739

వరాంగః

Mighty and beautiful limbed.  శ్రేష్టము, సుందరముగానుండు మోహనరూపుడు.

740

చందనాంగదీ

Sandal smeared.  పరమళించు చందనముచేతను వివిధములగు భూషణముల చేతను కూడియున్న వాడు.

741

వీరహా

Destroyer of the wicked heroes.  దుష్టరాక్షసులను సంహరించిన వీరుడు.

742

విషమః

unequalled.  అనంతమగు విశ్వమందు సకల పదార్థములకంటే విలక్షణుడై యున్నవాడు.

743

శూన్యః

The void.  గుణములుగాని ఆకారములుగాని లేనివాడు. నిర్మలము, నిష్కలంకము, స్వప్రకాశమును నై యున్న పరబ్రహ్మము.

744

ఘృతాశీః

The un-needed.  ఆశారహితుడు. తృష్ణారహితుడు.

745

అచలః

Non-moving.  పరమాత్మ అంతటను నిండిన వాడు. తన స్వరూపము నుండి గాని, దివ్య స్వభావము నుండి గాని చలనమును బొందనివాడు.

746

చలః

Moving.  వాయు రూపమున గదలిల కలిగినవాడు.

FirstPreviousNextLastIndex

Slide 80 of 110