శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

అణుర్బృహత్ కృశః స్థూలో గుణభృన్నర్గుణో మహాన్ః

అధృత స్స్వధృత స్స్వాస్యః  ప్రాగ్వంశో వంశవర్ధనః      90   AUDIO

 

835

అణుః

The subject. పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్ముడు. 

836

బృహత్

The Greatest. అణురూపములో వున్న పరమాత్మయే విశ్వమంతా వ్యాపించెను

837

కృశః

The Leanest. మిక్కిలి క్షీణించి సన్ననై సున్నితమై కన్నులకు కనబడని వాడు.

838

స్థూలః

The fatest. పరబ్రహ్మమే విశ్వమంతయు వ్యాపించిన స్థూల స్వరూపము.

839

గుణభృత్

With properties. గుణములు లేని పరమాత్మ రజోగుణముతో సృష్టిని, సత్త్వగుణముతో వృద్ధిని,  తమోగుణముతో లయమును చేయును.

840

నిర్గుణః

Without properties. పరమాత్మ గుణరహితుడు.

841

మహాన్

The Mighty. మహనీయుడు.

842

అధృతః

Un-supported. సమస్త బ్రహ్మాండములను ధరించునది పరబ్రహ్మము. ఆయనను ధరించునది ఏదియును లేదు.

843

స్వధృతః

Self-supported. అన్నిటిని ధరించియున్నది పరబ్రహ్మము.  అట్టి బ్రహ్మమును ధరించునది ఏది?  తన మహిమనే ఆధారముగా చేసికొని యున్నది పరబ్రహ్మము.

844

స్వాస్యః

Of charming face.  నిరాకారమైన పరబ్రహ్మమే భక్తులకొరకు సుందరముఖారవిందములతో భాసిల్లువాడు.

845

ప్రాగ్వంశః

Of ancient ancestory. సనాతనమైన వంశము గలవాడు. (కనుక విశ్వమునకు ఆదియైనవాడు)

846

వంశవర్ధనః

Multiplier of families. వంశమును ఈ ప్రపంచమును వృద్ధి పొందించువాడు.

FirstPreviousNextLastIndex

Slide 91 of 110