శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

సనాత్ సనాతన తమః కపిలః కపి రప్యయః

స్వస్తిదః స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభృత్ స్వస్తిదక్షిణః      96   AUDIO

 

896

సనాత్

భగవానుడు అనాదిగా నున్నవాడు.

897

సనాతనతమః

సృష్టికర్తయగు బ్రహ్మ సనాతనుడు.

898

కపిలః

సిద్ధులలో కపిలుడను నేను.

899

కపిః

సూర్యకిరణములద్వారా జలములను త్రాగువాడు.

900

అవ్యయః

ప్రళయకాలము నందు సర్వమును తనయందే యిముడ్చుకొనువాడు.

901

స్వస్తిదః

శుభములను ప్రసాదించువాడు.

902

స్వస్తికృత్

సమస్త శుభములను కలుగజేయువాడు.

903

స్వస్తి

పరమాత్మ మంగళ స్వరూపుడు.

904

స్వస్తిభుక్

మంగళములను శుభములను అనుభవించువాడు.

905

స్వస్తి దక్షిణః

మంగళ స్వరూపమున వృద్ధిపొందువాడు. శుభదాతయై విస్తరిల్లువాడు.

FirstPreviousNextLastIndex

Slide 97 of 110