శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః

శబ్దాతిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః      97   AUDIO

 

906

అరౌద్రః

క్రోధము జయించిన వాడు.

907

కుండలీ

కర్ణాభరణములు(కుండలములు) ధరించినవాడు. కుండలనీ శక్తిమేల్కొలిపినవాడు.

908

చక్రీ

సుదర్శనమను చక్రమును ధరించినవాడు.

909

విక్రమీ

అవతారములందు మహాపరాక్రమము చూపి రాక్షస సంహారము చేసినవాడు.

910

ఊర్జితశాసనః

స్మృతులు భగవానునియొక్క శాసనములు. వానిని అనుసరించువాడే భగవంతుని కిష్టుడు.

911

శబ్దాతిగః

శబ్దములకందనివాడు.

912

శబ్దసహః

సమస్తవేదములచేత తెలియబడువాడు.

913

శిశిరః

భక్తులకు శిశిర ఋతువు చల్లదనము వలె పరమశాంతిని చిత్తప్రసన్నతను ప్రసాదించువాడు.

914

శర్వీరీకరః

సాంసారిక జీవులకు, చీకటిని అజ్ఞానమును కలిగించువాడు.

FirstPreviousNextLastIndexText

Slide 98 of 110