శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరోరుచిరాంగదః

జననో జన జన్మాది ర్భీమో భీమ పరాక్రమః             101  AUDIO

 

941

అనాదిః

కారణములేనివాడు. సృష్టికంతకును శ్రీహరియే మూలకారణుడు.

942

భూర్భువః

సకలభూతములకు ఆశ్రయమైయున్న భూమికి ఆధారమైన వాడు.

943

లక్ష్మీః

సమస్త విభూతులకు నిలయము లక్ష్మి.

944

సువీరః

తన అవతారములందు అనేక ప్రశస్తములగు విభూతి లీలవర్తనములతో విలసిల్లినవాడు.

945

రుచిరాంగదః

మిక్కిలి సుందరములగు అలంకారములతో భాసిల్లినవాడు.

946

జననః

సకల ప్రాణులకు జనన కారకుడు.

947

జనజన్మాదిః

జన్మించిన సకల భూతములకు జన్మ కారణము.

948

భీమః

భయంకరుడు. దుర్మార్గులకు శిక్షలు విధించి వారిని సన్మార్గులుగా చేయువాడు.

949

భీమపరాక్రమః

తన అవతారములందు రాక్షస సంహారము గావించి మహా పరాక్రమము ప్రదర్శించినవాడు.

FirstPreviousNextLastIndex

Slide 102 of 110