Make your own free website on Tripod.com

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

ఆధార నిలయోఌధాతా పుష్పహాసః ప్రజాగరః

ఊర్ధ్వగ స్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః             102  AUDIO

 

950

ఆధారనిలయః

అఖిలాండ బ్రహ్మాండకోటికి, పంచభూతములకు, సమస్తమునకు ఆధారమైనవాడు.

951

అధాతా

తనకు వేరొక ఆధారము లేనివాడు.

952

పుష్పహాసః

అవ్యక్తమగు పరబ్రహ్మము మొగ్గ.  ఈ విశ్వమంతయు,  చక్కగా పరిమళములతో మనోజ్ఞముగా వికసించిన పుష్పము.

953

ప్రజాగరః

నిరంతరము మేల్కొనియే యుండువాడు.

954

ఊర్ధ్వగః

ఉన్నతోన్నతముగ, మహోన్నతముగ,  మహోన్నతోన్నతుడై యుండు వాడు పరమాత్మ.

955

సత్పథాచారః

ధర్మమార్గమునే సంచరించువాడు.

956

ప్రాణదః

సకలజీవులకు ప్రాణశక్తి ప్రదాత శ్రీహరియే.

957

ప్రణవః

పరమాత్మ వాచకమగు ఓంకారము,  ప్రణవము.

958

పణః

మానవుల కర్మలను పణము (మూల్యము)గా స్వీకరించి వారికి తగినరీతిగా ఫలమును ప్రసాదించువాడు.

FirstPreviousNextLastIndex

Slide 103 of 110