Make your own free website on Tripod.com

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః

దేవకీ నందనః స్రష్టా క్షితీశః పాప నాశనః             106  AUDIO

 

985

ఆత్మయోనిః

నామరూపాత్మకమగు అనంతవిశ్వమునకు కారణమయినవాడు.

986

స్వయంజాతః

తనంత తానుగానే జన్మించినవాడు.

987

వైఖానః

ఆదివరాహావతారమున భూమిని చీల్చుకొని లోన ప్రవేశించి  హిరణ్యాక్షుని సంహరించిన వాడు.

988

సామగాయనః

సదా సామవేదమును గానము చేయువాడు.

989

దేవకీనన్దనః

దేవకీ గర్భమున జన్మించిన శ్రీకృష్ణుడు.

990

స్రష్టా

అనంతకోటి లోకములను సృష్టించిన వాడు.

991

క్షితీశః

అనంతమైన భూమండలమునకు ప్రభువు.

992

పాపనాశనః

స్మరణ మాత్రముచే సమస్త పాపములు నశింపచేయు వాడు.

FirstPreviousNextLastIndex

Slide 107 of 110