శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః

నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః      3    AUDIO

18

యోగః

కలయిక జీవాత్మ పరమాత్మల సంయోగమే యోగము.

19

యోగవిదాం నేతా

యోగవిదులనగా యోగము బాగుగా తెలిసినవారు.  అట్టివారి యోగక్షేమములను తానే వహించి కాపాడువాడు.

20

ప్రధాన పురుషేశ్వరః

ప్రధానమనగా ప్రకృతి అని అర్ధము.  పురుష: అనగా ప్రాణులందుగల చైతన్యస్వరూపుడగు జీవుడు అని అర్థము.  ప్రకృతిపురుషులకు అతీతుడైన వాడు ప్రధాన పురుషేశ్వరుడు.

21

నారసింహవపుః

శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారము.  ప్రహ్లాదుని రక్షించడానికి  సగం మనిషి ఆకారంలో సగం సింహం ఆకారంలో స్తంభం నుండి అవతారమెత్తి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన వాడు.

22

శ్రీమాన్

సమస్త శ్రీలను వర్షింపజేయువాడు. శ్రీ అనగా లక్ష్మి విద్య ధనము ఐశ్వర్యము వైభవము ధృతి క్షమ ఓజస్సు తేజస్సు మున్నగు దివ్య విభూతులు.

23

కేశవః

సుందరమగు కేశములు కలవాడు కేశి అను రాక్షసుడిని వధించినవాడు. క(బ్రహ్మ)+(విష్ణు) + ఈశ(శివుడు) +(మూడు కలిసిన త్రిమూర్తి స్వరూపుడు).  ++ఈశ+= కేశవ

24

పురుషోత్తమః

లోకమున ముగ్గురు పురుషులు కలరు. క్షర పురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు.    నశించు శరీరములన్నియు  క్షర పురుషుడు.  అన్నిజీవులలో ప్రకాశించు ఆత్మస్వరూపుడు అక్షర పురుషుడు.  ఇక క్షరాక్షర పురుషులకతీతుడై,  సర్వశ్రేష్టుడై,  సర్వమున కాధారమై వెలుగు మహాపురుషుడే పురుషోత్తముడు.

 

 

 

FirstPreviousNextLastIndex

Slide 4 of 110