శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

సర్వః శర్వః శివః స్థాణుః భూతాదిర్నిధిరవ్యయః

సంభవో భావనోభర్తా ప్రభవః ప్రభురీశ్వరః          4    AUDIO

25

సర్వః

సర్వమును తానైన వాడు

26

శర్వః

సకల శుభములను కలిగించు వాడు

27

శివః

మంగళ ప్రదుడు

28

స్థాణుః

స్థిరముగా నుండువాడు

29

భూతాదిః

సకల భూతములకు ఆది (మొదలు), ప్రధముడు ఐనవాడు

30

నిధిరవ్యయః

నాశనములేని నిధి (నిలయము) ఐనవాడు.

31

సంభవః

తనకు తానుగానే పుట్టిన వాడు.

32

భావనః

ఇచ్చువాడు. సమస్త ప్రాణకోటికి కామితార్థములను ఇచ్చువాడు.

33

భర్తా

భరించువాడు.  లోకములను, ప్రాణకోటిని భరించువాడు.

34

ప్రభవః

సమస్తమునకును ఉత్పత్తి కారణమైన వాడు.

35

ప్రభుః

సర్యలోక మహేశ్వరుడు సర్వలోక నియంత సర్వశాసన కర్త

36

ఈశ్వరః

మహాశక్తి సంపన్నుడు. లోకవ్యాపారమలు సమస్తమును దక్షతతో  నిర్వహించు సర్వసమర్థ సర్వశక్తి స్వరూపుడైన భగవానుడు.

FirstPreviousNextLastIndex

Slide 5 of 110