శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

వైకుంఠః పురుషప్రాణఃప్రాణదః ప్రణవః పృథుః

హిరణ్యగర్భశ్శత్రుఘ్నో వ్యాప్తోవాయు రథోక్షజః     44     AUDIO

 

405

వైకుంఠః

విరోధము చేయువాడు. సృష్టి యొక్క ప్రారంభమున పంచభూతముల స్వేచ్ఛాగతులను నిరోధించినవాడు.  భక్తులు అధర్మమార్గములో పడకుండ నిరోధించువాడు.

406

పురుషః

శరీరమను పురములో నివసించు జీవుడు పురుషుడు.

407

ప్రాణః

ప్రాణ రూపమున శరీరములో వుండి చేష్టలు కలిగించువాడు.

408

ప్రాణదః

సర్వప్రాణులకు ప్రాణములిచ్చువాడు.

409

ప్రణవః

ఓంకార స్వరూపుడు.

410

పృథుః

వ్యాపకుడు. వివిధ నామరూపాలతో విశ్వమంతా విస్తరించి, విరాజిల్లువాడు.

411

హిరణ్యగర్భః

సృష్టికర్తయగు బ్రహ్మ

412

శత్రుఘ్నః

తన్నాశ్రయించిన భక్తుల మనస్సులలోని అసుర శక్తులను నాశనము చేయువాడు.

413

వ్యాప్తః

అంతటను వ్యాపించినవాడు.

414

వాయుః

సర్వ వ్యాపకుడు

415

అధోక్షజః

అంతర్ముఖములైన ఇంద్రియములచేత తెలియబడు వాడు

FirstPreviousNextLastIndex

Slide 45 of 110