శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురితక్రమః

దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహాః              83   AUDIO

 

773

సమావర్తః

Efficient turner. సంసార చక్రమును త్రిప్పువాడు నారాయణుడే.

774

నివృత్తాత్మాః

Inward minded.  విషయముల నుండి మరలిన మనస్సు కలవాడు.

775

దుర్జయః

Invincible.  జయింప శక్యము కాని వాడు.

776

దురతిక్రమః

Difficult to be disobeyed.  అతిక్రమించుటకు వీలుకాని వాడు.

777

దుర్లభః

Difficult to approach.  తేలికగా పొందబడువాడు కాడు. మిక్కిలి కష్టము చేతనే లభించువాడు.

778

దుర్గమః

Difficult to realise.  శ్రీహరిని వివిధ యోగ ప్రక్రియలద్వారాకూడ పొందుట కష్టము.

779

దుర్గః

Fortress.  లోనికి ప్రవేశించుటకు మిగుల కష్టమైన వాడు.

780

దురావాసః

Not easily lodged.  మిక్కిలి కష్టముగా మాత్రమే వాసయోగ్యుడు. నిరంతర నామ జపకీర్తనములతో కూడినవారికి మాత్రమే ఆయన సులభసాధ్యుడు.

781

దురారిహా

Destroyer of  dreadful enemies.  భయంకర శత్రు సంహారకుడు.

FirstPreviousNextLastIndex

Slide 84 of 110