శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

యజ్ఞభృద్వజ్ఞ కృద్యజ్జీ యజ్ఞభుగ్యజ్ఞ సాధనః

యజ్ఞాన్త కృద్యజ్ఞ గుహ్య మన్న మన్నాద ఏవచః       105  AUDIO

 

976

యజ్ఞభృత్

యజ్ఞ భర్తయును యజ్ఞపాలకుడును పరమాత్మయే.

977

యజ్ఞకృత్

యజ్ఞములను చేయువాడు.

978

యజ్ఞీ

యజ్ఞశేషమును పూర్తిచేయువాడు.

979

యజ్ఞభుక్

యజ్ఞములందు సమర్పింపబడు పదార్థములను ప్రీతితో భుజించువాడు.

980

యజ్ఞసాధనః

పరమాత్మయొక్క ప్రాప్తికి యజ్ఞములే సాధనములు.

981

యజ్ఞాన్తకృత్

ఫలప్రాప్తిని కలుగచేసి యజ్ఞమును పూర్తిచేయువాడు.

982

యజ్ఞగుహ్యమ్

యజ్ఞములలో మిక్కిలి రహస్యమును శ్రేష్ఠమును ఐన జ్ఞాన యజ్ఞము.

983

అన్నమ్

అన్నము పరబ్రహ్మ స్వరూపము.

984

అన్నాదః

అన్నమును భక్షించువాడు పరమాత్మయే.

FirstPreviousNextLastIndex

Slide 106 of 110