శ్రీ విష్ణు
సహస్ర నామ స్తోత్రము
|
విశ్వం
విష్ణుర్వషట్కారో
భూతభవ్య భవత్పభుః
భూతకృద్భూత
భృద్భావో భూతాత్మా
భూతభావనః 1 AUDIO
|
1
|
విశ్వం
|
విశ్వమును
సృజించి విశ్వమే
తానైన వాడు
|
2
|
విష్ణుం
|
అంతటను
వ్యాపించిన వాడు.
|
3
|
వషట్కారః
|
యజ్ఞములలో
“వషట్
క్రియ“ ఎవరిని
వుద్దేశింపబడినదో, అట్టి భగవత్స్వరూపము.
|
4
|
భూతభవ్య
భవత్పభుః
|
భూత
కాలము, వర్తమానకాలము,
భవిష్యకాలమునకు
ప్రభువైన కాల పురుషుడు.
|
5
|
భూతకృత్
|
భూతములను
సృష్టించువాడు; భూతములను
నాశనం చేయువాడు
|
6
|
భూతభృత్
|
భూతములను
పోషించు వాడు.
|
7
|
భావః
|
ఉనికియై
వున్నవాడు.
|
8
|
భూతాత్మా
|
సకల
భూతములకు ఆత్మ
ఐన వాడు.
|
9
|
భూతభావనః
|
సకల
భూతములను సృష్టించి,
పోషించువాడు.
|