283
|
అమృతాంశూద్భవః
|
తన అమృతమయమగు
కిరణములచేత సస్యములను
పోషించువాడు.
|
284
|
భానుః
|
దివ్యప్రకాశరూపమున
విశ్వమంతయును
వెలిగించువాడు.
|
285
|
శశబిన్దుః
|
కుందేలువంటి
చిహ్నము తనయందు
కలిగియున్న చంద్రుడు.
|
286
|
సురేశ్వరః
|
దేవతలకు
అధిపతి ఐనవాడు.
|
287
|
ఔషధమ్
|
భయంకరమగు
సంసారవ్యాధిని
బోగొట్టు ఔషధము
భగవంతుని నామమే.
|
288
|
జగతస్సేతుః
|
భయంకరము
సంసారసాగరమును
దాటుటకు వంతెనవంటిది
భగవన్నామము.
|
289
|
సత్యధర్మపరాక్రమః
|
భగవంతుడు
సత్యస్వరూపుడు.
ధర్మస్వరూపుడు.
|