275
|
ఓజస్తేజోద్యుతిధరః
|
ఓజస్సు
తేజస్సు ద్యుతి
ఈ మూడు పవిత్రలక్షణములు
కలవాడు.
|
276
|
ప్రకాశాత్మా
|
ప్రకాశ
స్వరూపమైన ఆత్మగలవాడు.
|
277
|
ప్రతాపనః
|
సూర్యుని
రూపాన తన కిరణాలతో
లోకమును తపింపచేయువాడు.
|
278
|
ఋద్ధః
|
విశ్వమంతయు
భగవంతుని విభూతులతో
నిండియున్నది.
|
279
|
స్పష్టాక్షరః
|
స్పష్టమగు
దివ్యశబ్దముతో
నొప్పువాడు.
|
280
|
మంత్రః
|
వేదస్వరూపమయిన
మంత్రము ద్వారా
ఉపాసించదగిన
భగవానుడు.
|
281
|
చంద్రాంశుః
|
చంద్రకిరణములద్వారా
సస్యములను ఫలింపచేయువాడు.
|
282
|
భాస్కరద్యుతిః
|
సూర్యకాంతితో
జగమంతయు చైతన్యవంతము
చేయువాడు.
|