శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము
గభస్తినేమిః సత్త్వస్థః సింహోభూత మహేశ్వరః
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవ భృద్గురః 52 AUDIO
486
గభస్తినేమిః
కిరణచక్రము యొక్కమధ్యభాగమునందు సూర్యరూపమున విలసిల్లువాడు.
487
సత్త్వస్థః
సత్త్వగుణమునందు ప్రతిష్టితుడై యున్నవాడు.
488
సింహః
శ్రీహరి నామమనే సింహగర్జనకు దుర్గుణములు నశించును.
489
భూతమహేశ్వరః
సమస్తభూతజాలములకు అధిపతి
490
ఆదిదేవః
అందరిదేవతలకంటే ముందుగా నున్నవాడు.
491
మహాదేవః
పరమశివుడు
492
దేవేశః
దేవతల కందరకును ప్రభువైనవాడు.
493
దేవభృద్గురుః
దేవతలందరికి అధిపతియైనవాడు.
Slide 53 of 110