శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము
ధర్మగుబ్ధర్మీ కృద్ధర్మీసదసత్క రమక్షరమ్
అవిజ్ఞాతా సహస్రాంశు ర్విధాతా కృతలక్షణః 51 AUDIO
475
ధర్మగుప్
ధర్మ రక్షకుడు ధర్మ స్వరూపుడు
476
ధర్మకృత్
ధర్మానుష్టానము చేయువాడు.
477
ధర్మీ
మూర్తీభవించిన ధర్మము.
478
సత్
సకల భూతములయందు శాశ్వతమై స్థిరమై నిత్యమై యుండు పరబ్రహ్మము
479
అసత్
నశించు స్వభావము గల ప్రపంచము
480
క్షరమ్
నశించునది
481
అక్షరమ్
నాశనము లేనివాడు పరమాత్మ
482
అవిజ్ఞాతా
బంధరహితుడు మాలిన్య రహితుడు నిస్సంగుడు నిర్లిప్తుడు
483
సహశ్రాంశు
వేలకొలది కిరణాలతో కూడియున్న వాడు సూర్యుడు
484
విధాతా
సర్వమును ధరించువాడు
485
కృతలక్షణ
అనేక దివ్య లక్షణాలతో కూడి యున్నవాడు
Slide 52 of 110