శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము
సోమపోఌమృతపః సోమఃపురుజిత్పురుషసత్తమః
వినయో జయః సత్యసంధోదాశార్హః సాత్వతాంపతిః 54 AUDIO
503
సోమపః
భగవానుడు యజ్ఞేశ్వరుడు. యజ్ఞములందు సోమపానము చేయువాడు.
504
అమృతపః
అమృతపానము చేయువాడు
505
సోమః
చంద్రుడు. రసస్వరూపుడగు చంద్రుడై సస్యములను ఫలింపచేయువాడు.
506
పురుజిత్
శత్రువులను జయించినవాడు
507
పురుసత్తమః
విశ్వరూపుడగు సర్వశ్రేష్టుడు.
508
వినయః
పెద్దలయెడ వినయవిధేయతలతో నున్న శ్రీరాముడు.
509
జయః
సకల పుణ్యకార్యములకు జయము ప్రసాదించువాడు.
510
సత్యసన్ధః
సత్యస్వరూపుడు భగవానుడు.
511
దాశార్హః
దానమునకు అర్హుడైనవాడు.
512
సాత్త్వతాంపతిః
సాత్త్వికులకు అధిపతియైనవాడు.
Slide 55 of 110