శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

జీవోవినయితా సాక్షీ ముకుందోఌమిత విక్రమః

అంభోనిధిః రనంతాత్మా మహోదధిశయోఌంతకః       55  AUDIO

 

513

జీవః

శరీరములందు జీవుని రూపమున  నెలకొన్న పరమాత్మ.

514

వినయితా సాక్షీ

తన భక్తులలో వున్న వినయసంపదకు సాక్షియై వుండువాడు.

515

ముకుందః

మోక్షము నిచ్చువాడు.

516

అమిత విక్రమః

కొలుచుటకు వీలుకానంత పెద్దవగు పాద విన్యాసములు కలవాడు.

517

అంభోనిధిః

మహా సాగరుడు.

518

అనంతాత్మా

తాను ఒక్కడే అయినను విశ్వమంతటను అనేక రూపములతో వ్యాపించి వున్నవాడు. విశ్వమంతయు విశ్వనాధుని విరాట్ స్వరూపమే.

519

మహోదధిశయః

క్షీరసాగరమందు ఫణిరాజు శయ్యపై శయనించినవాడు.

520

అన్తకః

నాశనము చేయువాడు.  మనస్సులోని దుర్గుణములు నశింపచేయువాడు.

FirstPreviousNextLastIndex

Slide 56 of 110