శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము
స్వక్షః స్వంగః శతానందో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిః శ్ఛిన్న సంశయః 66 AUDIO
615
స్వక్షః
చల్లని చూపులు కలవాడు.
616
స్వంగః
మనోజ్ఞములైన సమస్తావయవములు కలవాడు.
617
శతానందః
శతసహస్రకోటి దివ్యరూపములుగా సకలజీవులలో వ్యాపించి సహస్రవిధములుగా జీవులకు మహానందములను ప్రసాదించువాడు.
618
నన్దిః
ఆనంద నిధి.
619
జ్యోతిర్గణేశ్వరః
సూర్యచంద్రాదులైన సమస్త జ్యోతిర్గణములకు అధిపతి.
620
విజితాత్మా
సర్వేంద్రియములను జయించి అంతర్ముఖుడై యుండువాడు.
621
విధేయాత్మా
ఎవ్వరివలన విధింపబడు స్వరూపము గలవాడు కాడు. భక్తులకు విధేయుడు.
622
సత్కీర్తిః
గొప్పకీర్తి కలవాడు.
623
ఛిన్నసంశయః
సకల సంశయములను నశింపజేయువాడు.
Slide 67 of 110