605
|
శ్రీదః
|
భక్తులకు సిరులనిచ్చువాడు.
|
606
|
శ్రీశః
|
లక్ష్మీదేవికి భర్త.
|
607
|
శ్రీనివాసః
|
పుణ్యాత్ములందు నివసించువాడు.
|
608
|
శ్రీనిధిః
|
సమస్త దివ్యవిభూతులకు
నిలయమైనవాడు.
|
609
|
శ్రీవిభావనః
|
జీవులకు వారివారి
కర్మానుసారముగా
శ్రీ(సంపద)లను పంచిపెట్టువాడు.
|
610
|
శ్రీధరః
|
శ్రీ (లక్ష్మీ) ని ధరించువాడు.
|
611
|
శ్రీకరః
|
సంపదలను తన
భక్తులకు
కలిగించువాడు.
|
612
|
శ్రేయః
|
మోక్షమును ప్రసాదించువాడు.
|
613
|
శ్రీమాన్
|
శ్రీమంతుడు. సకల
భోగభాగ్యములు
తనయందే కలవాడు.
|
614
|
లోకత్రయాశ్రయః
|
మూడు లోకములను
సంరక్షించువాడు.
శ్రీహరి.
|