శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

అక్రూరః పేశలోదక్షో దక్షిణః క్షమిణాంవరః

విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణ కీర్తనః      98   AUDIO

 

915

అక్రూరః

క్రౌర్యము లేనివాడు.

916

పేశలః

మృదు స్వభావము గలవాడు.

917

దక్షః

సమర్ధత, ప్రతిభ, కార్యనిర్వహణ చాతుర్యము, శక్తిసంపద, శీఘ్రకారిత్వము, పట్టుదల, అప్రమత్తత మున్నగు గుణసంపద కలవాడే దక్ష అనబడును.

918

దక్షిణః

భగవానుడు తన్నాశ్రయించిన భక్తులకు వారివారి యర్హతలను బట్టి దక్షిణలను ఇచ్చు చుండువాడు.

919

క్షమిణాంవరః

ఓర్పు లేక సహనము.   ద్వంద్వములను సహించుటయే సహనము. అదియే యోగము.

920

విద్వత్తమః

సర్వవిద్యా పారంగతుడు. సర్వశాస్త్రనిధి.  సకల శ్రుతిసాగరుడు.

921

వీతభయః

సర్వ భయ రహితుడు.

922

పుణ్యశ్రవణ కీర్తనః

శ్రవణము, కీర్తనము  ఈ రెండును పరమేశ్వర ప్రాప్తికి పరమ సాధనములు.

FirstPreviousNextLastIndex

Slide 99 of 110