932
|
అనన్తరూపః
|
అనంతవిశ్వమంతా
అనంతుని అనంతరూపములే.
|
933
|
అనన్తశ్రీ
|
విశ్వమంతయును
ఆయన విభూతులే.
|
934
|
జితమన్యుః
|
కోపమును
జయించినవాడు.
|
935
|
భయాపహః
|
భక్తులయొక్క
సమస్త భయములను
పొగొట్టువాడు.
|
936
|
చతురశ్రః
|
అందరియందును
సమానముగా వర్తించువాడు.
|
937
|
గభీరాత్మా
|
సాగరము
వలే మహాగంభీరుడు.
అతనిలోతు నెవ్వరును
గ్రహింపలేరు. మనస్సు
చేత వూహింపలేరు. భాషలచేత
తెలుపలేరు.
|
938
|
విదిశః
|
విశేషముగా
దాతృత్వము గలవాడు.
తన భక్తులకు నిరంతరమును
వారివారి యోగ్యతల
ననుసరించి ఫలములను
వర్షింపచేయువాడు.
|
939
|
వ్యాదిశః
|
మహాశాసన
కర్త.
|
940
|
దిశః
|
జ్ఞాన
ప్రబోధకుడు. భగవానుడు
జ్ఞానస్వరూపుడు.
|