941
|
అనాదిః
|
కారణములేనివాడు.
సృష్టికంతకును
శ్రీహరియే మూలకారణుడు.
|
942
|
భూర్భువః
|
సకలభూతములకు
ఆశ్రయమైయున్న
భూమికి ఆధారమైన
వాడు.
|
943
|
లక్ష్మీః
|
సమస్త
విభూతులకు నిలయము
లక్ష్మి.
|
944
|
సువీరః
|
తన అవతారములందు
అనేక ప్రశస్తములగు
విభూతి లీలవర్తనములతో
విలసిల్లినవాడు.
|
945
|
రుచిరాంగదః
|
మిక్కిలి
సుందరములగు అలంకారములతో
భాసిల్లినవాడు.
|
946
|
జననః
|
సకల
ప్రాణులకు జనన
కారకుడు.
|
947
|
జనజన్మాదిః
|
జన్మించిన
సకల భూతములకు
జన్మ కారణము.
|
948
|
భీమః
|
భయంకరుడు.
దుర్మార్గులకు
శిక్షలు విధించి
వారిని సన్మార్గులుగా
చేయువాడు.
|
949
|
భీమపరాక్రమః
|
తన అవతారములందు
రాక్షస సంహారము
గావించి మహా పరాక్రమము
ప్రదర్శించినవాడు.
|