శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

అజః సర్వేశ్వరః  సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః

వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిస్రుతః    11    AUDIO

 

95

అజః

పుట్టుకలేని వాడు.

96

సర్వేశ్వరః

ఈశ్వరులకెల్ల ఈశ్వరుడు.   ప్రభువులకెల్ల  ప్రభువు.

97

సిద్ధః

పొందదగిన సమస్త సిద్ధులు పొందిన వాడు.

98

సిద్ధిః

ఫలస్వరూపుడు.  తన్నాశ్రయించిన భక్తులకు సర్వసిద్ధులు అనుగ్రహించువాడు.

99

సర్వాదిః

మూలకారణ స్వరూపమగు పరబ్రహ్మము

100

అచ్యుతః

పతనము లేని వాడు. నిత్యుడు. మంగళకరుడు.

101

వృషాకపిః

జలములలో మునిగిపోవుచున్న భూమిని ఉద్ధరించిన వరాహమూర్తి.   భయంకర సంసారసాగరము నుండి ఉద్ధరించువాడు.

102

అమేయాత్మా

ఆత్మస్వరూపము యొక్క ప్రమాణము కొలిచి చెప్పుటకు సాధ్యము కాదు.

103

సర్వయోగ వినిస్రుతః

దేనితోను సంగము లేనివాడు.

FirstPreviousNextLastIndex

Slide 12 of 110