శ్రీ విష్ణు
సహస్ర నామ స్తోత్రము
|
స్వయంభూః
శంభురాదిత్యః
పుష్కరాక్షో
మహాస్వనః
అనాది
నిధనో ధాతా విధాతా
ధాతు రుత్తమః 5 AUDIO
|
37
|
స్వయంభూ
|
తనంతట
తానుగానే ఉత్పన్న
మయినవాడు
|
38
|
శంభుః
|
శుభములను
ప్రసాదించువాడు
|
39
|
ఆదిత్యః
|
సూర్యభగవానుడు.
|
40
|
పుష్కరాక్షః
|
తామరపూవులవంటి
నేత్రములు కలవాడు.
|
41
|
మహాస్వనః
|
గంభీరమగు
దివ్య నామ స్వరూపుడు.
|
42
|
అనాదినిధనః
|
ఆది(జననము),
నిధనము (మరణము, నాశనము) లేనివాడు
|
43
|
ధాతా
|
నామరూపాత్మకమైన
ఈ చరాచర విశ్వమంతటిని
ధరించినవాడు
|
44
|
విధాతా
|
చక్కని
విధానములను గావించినవాడు
– సూర్యుడు
ప్రకాశించుట,
గాలి వీచుట, మేఘం
వర్షించటం -
అగ్ని
మండటం, మొదలైనవి.
|
45
|
ధాతురుత్తమః
|
ప్రపంచోత్పత్తికి
కారణ భూతములగు
సమస్త భూతములకూ
ఆధారభూతుడు.
|