శ్రీ విష్ణు
సహస్ర నామ స్తోత్రము
|
అప్రమేయో
హృషీకేశః పద్మనాభోఌమర
ప్రభుః
విశ్వకర్మా
మనుస్త్వష్టా
స్థవిష్ఠః స్థవిరో
ధ్రువః 6 AUDIO
|
46
|
అప్రమేయః
|
ప్రమాణములచేత
తెలియబడువాడు
కాడు.
|
47
|
హృషీకేశః
|
ఇంద్రియముల(హృషీకముల)కు
ప్రభువు. మనోహరమైన
కిరణమలతో భాసించువాడు.
|
48
|
పద్మనాభాః
|
పద్మము
నాభి యందు గలవాడు.
|
49
|
అమరప్రభుః
|
దేవతల(అమరుల)కు
అధిపతి.
|
50
|
విశ్వకర్మా
|
విశ్వసృష్టియంతయు తనయొక్క
కర్మగా కలిగియున్నవాడు
|
51
|
మనుః
|
మననము,
చింతనము చేయువాడగుటచే
మను: అనబడును.
|
52
|
త్వష్టా
|
మిక్కిలి
పెద్ద స్వరూపములను
మిక్కిలి చిన్న
స్వరూపములగా
చేయువాడు. ప్రళయకాలమందు
సమస్తమును తనయందు
యిమిడ్చుకొనువాడు.
|
53
|
స్థవిష్ఠః
|
మిక్కిలి
స్థూల స్వరూపుడు.
|
54
|
స్థవిరోధ్రువః
|
సనాతనము(స్థవిరము)గా
స్థిరము(ధ్రువము)గానున్నది.
స్థిరుడై, నిత్యుడై
వున్న సనాతనుడు.
|