శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము
అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్థనః
ప్రభూతః త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్. 7 AUDIO
55
అగ్రాహ్యః
పరమాత్మ చక్షురాది ఇంద్రియములకందనివాడు.
56
శాశ్వతః
అన్ని కాలములందు వుండువాడు.
57
కృష్ణః
పవిత్రమగు మంగళనామము – సచ్చిదానంద స్వరూపుడు.
58
లోహితాక్షః
ఎర్రని నేత్రములు కలవాడు
59
ప్రతర్థనః
నాశనము చేయువాడు
60
ప్రభూతః
పరిపూర్ణుడై పుట్టినవాడు.
61
త్రికకుబ్ధామః
మూడు భాగములయందు (జాగ్రత్-స్వప్న-సుషుప్తులయందు) ఆశ్రయమై యున్నవాడు.
62
పవిత్రమ్
పరమపావన స్వరూపుడు.
63
పరం మంగళమ్
స్మరణ మాత్రాము చేతనే అన్ని అశుభములను తొలగించి మంగళములను ప్రసాదించువాడు.
Slide 8 of 110