74
|
ఈశ్వరః
|
సర్వమును
శాసించువాడు
– సర్వశక్తి
సంపన్నుడు.
|
75
|
విక్రమీ
|
బలము,
తేజస్సు, పరాక్రమము
మొదలగు వీరుల
గుణములు కలవాడు.
|
76
|
ధన్వీ
|
ధనుస్సును
ధరించినవాడు.
|
77
|
మేధావీ
|
మహాజ్ఞాన
భాండారము.
|
78
|
విక్రమః
|
వామనావతార
వైభవమును తెలుపు
పవిత్రనామము.
|
79
|
క్రమః
|
విశ్వమంతా
నిండి విస్తరించి,
వికసించి, వ్యాప్తిచెందిన
పరబ్రహ్మము
|
80
|
అనుత్తమః
|
ఈయనకంటే
మరియొక శ్రేష్టుడైన
వాడు వేరొకడు
లేడు.
|
81
|
దురాధర్షః
|
తన్నెదిరింపగల
శక్తి సంపన్నుడెవడును
లేనే లేడు.
|
82
|
కృతజ్ఞః
|
భగవానుడు
ప్రతివాని మనస్సునందును
గలుగుచుండు సమస్త
ఆలోచనలు గ్రహింపగలిగినవాడై
వారి భక్తిశ్రద్ధల
కనుగుణముగా ఫలములను
ప్రసాదించువాడు.
|
83
|
కృతిః
|
అనగా
పురుష ప్రయత్నము. ఇది కూడా
దైవస్వరూపమని
భావము.
|
84
|
ఆత్మవాన్
|
చరాచరాత్మకమగు
విశ్వమందంతటను
ఆత్మ స్వరూపుడై
భాసిల్లు పూర్ణస్వరూపుడే
భగవానుడు.
|