114
|
రుద్రః
|
ప్రళయకాలమున
సకల ప్రాణులను
లయము గావించుచు
దుఃఖమును గలిగించువాడు.
|
115
|
బహుశిరాః
|
అనేక
శిరస్సులు కలవాడు.
|
116
|
బభ్రుః
|
లోకములను,
సకల ప్రాణకోటులను
భరించువాడు – రక్షించువాడు
– ఆధారమైన
వాడు.
|
117
|
విశ్వయోనిః
|
ఈ అనంత
విశ్వమున కంతటకును
కారణమైన వాడు.
|
118
|
శుచిశ్రవాః
|
శుచియును
మంగళకరములునగు
అనేక నామములు
కలవాడు.
|
119
|
అమృతః
|
మరణము
లేనివాడు. సకలవ్యాధులను
క్లేశములను హరించి
మోక్షమును ప్రసాదించువాడు.
|
120
|
శాశ్వతః
స్థాణుః
|
నిత్యుడై
వున్నవాడు. చలనరహితుడై
అంతటను నిండియున్నవాడు.
|
121
|
వరారోహః
|
మిక్కిలి
శ్రేష్టమైన ఊర్థ్వగతిని
గలిగించువాడు.
|
122
|
మహాతపాః
|
గొప్పతపస్సు
గలవాడు.
|